- జిల్లా జడ్పిచైర్మన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డి
కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమ విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలని రంగారెడ్డి జిల్లా జడ్పిచైర్మన్ తీగల అనితాహరినాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం మండల కేంద్రంతో పాటు ఘట్టుపల్లి, గంగారం, హర్షగూడ, మన్సాన్‌పల్లి గ్రామాలలో నిర్వహిస్తున్న నర్సరీలను జడ్పిచైర్మన్ ఆకస్మికంగా తనిఖిచేశారు.
ఈ సందర్బంగా గట్టుపల్లి కెసిఆర్ స్పోర్ట్ ఆండ్‌రిసార్ట్‌లో ఏర్పాటుచేసిన సమీక్ష సమావేశంలో తీగల అనితారెడ్డి మాట్లాడుతూ సిఎం మానసపుత్రిక అయిన హరితహర కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఏలాంటి అలసత్వం వహించరాదని నాటిన ప్రతి మొక్కను రక్షించుకోవాల్సిన భాద్య త మనపై ఉందని గుర్తుచేశారు.
అనేక విడుతలలో చేసిన కార్యక్రమాలు సంతృప్తిగా ఉన్నా కొన్ని చోట్ల నిర్లక్షానికి గూరిచేస్తున్న చోట్ల అధికారులు చోరవతీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం 9 విడుతలో చేపడుతున్న హరితహర కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 33 శాతం అడువులను పెంచాలని నిర్ధేశించగా ఇప్పటికే 26 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. అలాగే జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు మెరుగయ్యాయని, నర్సరీలలో ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారో, నాటిన మొక్కల వివరాలు వంటివిషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గంగారం గ్రామ నర్సరీ పనులు బాగున్నాయని సర్పంచ్‌ను అభినందించగా హర్షగూడలో నర్సరీలో మొక్కల సంరక్షణ సరిగ్గా చూడలేకపోయిన పంచాయితీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయితీ అధికారికి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఎంపిపి రఘుమారెడ్డి, జిల్లా పరిషత్ సిఈఓ దిలీప్ కుమార్, డిఆర్‌డిఓ ప్రభాకర్, డిపిఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎపిడి నీరజ, ఎంపిడిఓ నర్సింహులు, మండల బిఆర్‌ఎస్ పార్టీ అద్యక్షుడు రాజునాయక్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, హర్షగూడ సర్పంచ్ పాండు నాయక్, ఉపసర్పంచ్ రవి నాయక్, గంగారం సర్పంచ్ సాలి వీర్యానాయక్, మార్కెట్ కమిటి డైరెక్టర్ రవీందర్, మహేశ్వరం సర్పంచ్ కర్రోళ్ల ప్రియాంక రాజేష్, మన్సాన్‌పల్లి సర్పంచ్ కంది అరుణ రమేష్, ఉపసర్పంచ్‌నర్సింహ్మ, గట్టుపల్లి సర్పంచ్ యాదయ్య, అయా గ్రామాల కార్యదర్శులు, వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.