Monday, December 23, 2024

బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరు కష్టపడాలి

- Advertisement -
- Advertisement -

నల్గొండ :ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి కష్టపడి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో మహాజన సంపర్కులో భాగంగా వివిధ మోర్చాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వం వేసిన జాతీయ రహదారులు, గ్రామాలకు కేటాయించిన నిధులు తోపాటు తొమ్మిదేళ్ల పాలన నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. రానున్న మూడు నెలలు ప్రతి కార్యకర్త అంకుఠిత దీక్షతో పనిచేస్తూ నిత్యం ప్రజల్లో ఉండాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్ని మోర్చాల నాయకులు గ్రామస్థాయి నుంచి సంబంధిత మోర్ఛలను బలోపేతం చేసి చైతన్య పరచాలని అన్నారు.

జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్ర శేఖర్, పార్లమెంట్ ఇంచార్జి బండారు ప్రసాద్, కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, ఎస్సి సెల్ రాష్ట్ర కార్యదర్శి పోతేపాక సాంబయ్య, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి, నాయకులు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, నాగం వర్షిత్ రెడ్డి, గడ్డం మహేష్, హరి, సాయి, ఐతరాజు సిద్దు, గుండ్ల పల్లి శాంతి స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News