Friday, December 20, 2024

ప్రతిఒక్కరూ వీర సైనికుల్లా పని చేయాలి

- Advertisement -
- Advertisement -
  • కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి రూరల్: ప్రతిఒక్కరు వీర సైనికుల్లా పనిచేయాలని, అభివృద్ధి సంక్షేమ పథకాలే బిఆర్‌ఎస్ పార్టీ బలమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. మంగళవారం మెట్‌పల్లి పట్టణంలోని విఆర్‌ఎం. గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మండల బూత్ స్థాయి ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, బిఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కోరుట్ల సీటును కేసిఆర్‌కు బహుమతిగా అందజేయాలని అన్నారు. కెసిఆర్‌ను హ్యాట్రిక్ సియంగా చేయాలని, పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మారు సాయిరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మెట్‌పల్లి మండల అధ్యక్షులు నల్ల తిరుపతి రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News