Wednesday, January 22, 2025

నగర అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలి

- Advertisement -
- Advertisement -
  • మైసమ్మ, పోచమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి
  • అధికారులను ఆదేశించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

హన్మకొండ ప్రతినిధి: నగర అభివృద్ధికి అందరూ సమష్టిగా పనిచేయాలని, మైసమ్మ, పోచమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. వడ్డెపల్లి పార్కులో ఆదివారం 60వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్య నాయకులు, వివిధ విభాగాల అధికారులతో సర్వసభ్య సమావేశాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. నగరాభివృద్ధిలో భాగంగా రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చాలా చిన్నదిగా ఉందని అందుకోసం రోడ్లను వెడల్పు చేసే బాధ్యతను కుడాకు అప్పగించామన్నారు. వడ్డెపల్లిలో పోచమ్మ, మైసమ్మ పండుగల నిర్వహణ తేదీలను అశోక్ పూజారిని అడిగి సెప్టెంబరు 3న మైసమ్మ పండుగ, 10న పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లను చూడాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 60వ డివిజన్ పరిధిలో పూర్తి ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్‌లను ఇస్తామని, పాక్షికంగా ధ్వంసమైన ఇళ్లకు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందన్నారు.

గృహలక్ష్మి పథకం కింద అర్హులైన లబ్ధిదారులు అప్లై చేసుకోవాలన్నారు. బీసీ బంధు పథకం కింద రూ. లక్ష రుణ సాయాన్ని 300 మందికి అందించామని మరో దఫా అప్లై చేసుకోవాలన్నారు. దళిత బంధు కింద అనేక మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుందన్నారు. పింఛన్లు రానటువంటి వారికి ఆసరా, వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్లను త్వరలో అందిస్తామన్నారు. డివిజన్ పరిధిలో లిస్టును తయారుచేసి అధికారులకు అందించాలన్నారు. రేషన్ షాపు దూరమైతుందని కొంత మంది ప్రజలు తెలుపగా ఆ సమస్యను తక్షణమే నెరవేర్చాలని తహసీల్దారుకు తెలిపారు.

కళాశాలకు సంబంధిన విషయం పై కళాశాల ప్రాంగణంలో బురద కాకుండా మొరం కాని, డస్ట్ కాని పోయిస్తానన్నారు. విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్, మాజీ కార్పోరేటర్ మిడిదొడ్డి స్వప్న, శ్రవణ్‌కుమార్, వివిధ సంఘాల నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News