Wednesday, January 22, 2025

కెసిఆర్ బాటలో అందరూ కలిసిపోయి పని చేయాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: సీఎం కేసీఆర్ నాయకత్వం బాగుందని గులాబీ జెండా కింద పనిచేయడానికి అనేక మంది వస్తున్నారని, కేసీఆర్ బా టలో పాత, కొత్త అనే తేడాలు మర్చిపోయి అందరూ కలిసి పనిచేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో తుర్కపల్లి మండలం బిల్వతండా, ధర్మారం, రుస్తాపురం, దయ్యాలబండ గ్రామాల సర్పంచ్‌లు జోతి భాస్కర్ నాయక్, లలితశ్రీనునాయక్, లావణ్యనారాయ ణ, మాంగ్యానాయక్‌తో పాటు 500 మంది బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్లో చేరారు.

ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాకప్పి బీఆర్‌ఎస్‌లోకి ఆ హ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజకీయాల్లో అందరికీ అవకాశాలు తొందరగా రాకపోయినా ఎప్పటికీ గుర్తింపు మాత్రం ఉ ంటుందని తెలిపారు. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నా ల క్షంతో పనిచేసే నాయకులు కొందరే ఉంటారని, అందులో కేసీఆర్ ఒక్కరేనని అ న్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో కలిసి నడిచామనే సంతృప్తి అ ందరికీ దక్కిందని, చరిత్రలో నిలిచిపోయిన పోరాటంలో మనం భాగస్వాములు కావడంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆర్థికంగా ఉన్నా, లేకపోయినా గ్రామాలను సర్పంచ్‌లు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.కెసిఆర్ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం 20 కిలోమీరట్ల బునాదిగాని కాల్వ పనులు సొంత నిధులతో చేయిస్తున్నానని తెలిపారు. జిల్లాలో ఎక్కడాలేని విధంగా రూ 46 లక్షల సొంత నిధులతో ఆలేరులో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చే శామని, 76 మందికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని తెలిపారు.

తుర్కపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసిఅక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఇందుకు సంబంధించి భూసేకరణ పూ ర్తి అయినందని, నిర్వాసితులకు పరిహారం సైతం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ బిర్కూనాయక్, నాయకులు ర్యాకల రమేష్, నరేందర్‌రెడ్డి, రవీందర్‌నాయక్, నర్సింహ్మరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బాలకృష్ణ, మహేందర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News