Monday, January 20, 2025

నా ట్వీట్లు నా వ్యక్తిగత అభిప్రాయాలు..

- Advertisement -
- Advertisement -

Everything I tweet is my personal Opinions: Shashi Tharoor

న్యూఢిల్లీ: తాను ట్వీట్ చేసే ప్రతి విషయం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ తెలిపారు. కాళీ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువ మొయిత్రా వ్యాఖ్యలపై తాను చేసిన ట్వీట్‌ను కాంగ్రెస్ పార్టీ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో థరూర్ గురువారం ట్విటర్ వేదికగా ఈ విధంగా వివరణ ఇచ్చారు. దర్శకురాలు లీలా మణిమేఖలై నిర్మించిన కాళీ డాక్యుమెంటరీకి సంబంధించిన పోస్టర్‌పై టిఎంసి ఎంపి మహువ మొయిత్రా మంగళవారం చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని సృష్టించాయి. ఒక వ్యక్తిగా కాళీ మాతను మాంసాహార భక్షిణిగా, మద్యాన్ని స్వీకరించే దేవతగా ఊహించుకునే హక్కు తనకు ఉందని, తమ తమ పద్ధతుల్లో దేవతనో దేవుడినో ఆరాధించే హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందని మహువ చేసిన వ్యాఖ్యలపై బిజెపి తీవ్రంగా విమర్శించగా టిఎంసి మాత్రం ఆ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని పేర్కొంది. కాగా, థరూర్ మాత్రం మహువపై బిజెపి విమర్శల దాడిని ఖండిస్తూ మతాచారాలు ప్రజల వ్యక్తిగతమని, అవి వారికే వదిలిపెట్టాలని రాజకీయ పార్టీలను కోరారు.

Everything I tweet is my personal Opinions: Shashi Tharoor

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News