మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అన్ని ఏర్పా ట్లు పూర్తి చేసింది. యాసంగి పంట ల సాగులో పెట్టుబడిసాయం కోసం ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం ఒకేసారి రూ.7700కోట్లు విడుదల చేసింది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధుల విడుదల ప్రభుత్వ ఖజానాకు తలకు మించిన భారమే అయినప్పటికీ వ్యవ సాయ రైతులు ఎక్కడా పెట్టుబడికి నిధులు లేక ఇబ్బంది పడరాదని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుని నిధుల సమీకరణ పూర్తి చేసింది. ఈ మేరకు ఇప్పటికే ఆ ర్థికశాఖ రైతుబంధు నిధుల విడుదలకు లైన క్లియర్ చే సింది. ఈ నెల 23నుంచే రైతుబంధు నిధుల పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరు గుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డుప డింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసే వరకూ రైతుబంధు నిధులు పంపిణీ చేపట్టరాదని తెలంగాణ ఎన్నికల సంఘం ఆదేశించింది. వ్యవసాయరంగంలో రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉం చుకుని రైతుబంధు పథకానికి కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రైతులు , రైతు సంఘాల నేతలు ఎన్నికల సంఘానికి విజ్ణప్తులు చేస్తూ వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుబంధు పథకం కొత్తదేమి కాదని , ఈ పథకం అమలు లక్ష్యాలను పరిగణలోకి తీసుకుని నిధుల పం పిణీకి అనుమతి ఇవ్వాలని ఇసికి లేఖలు రాసింది .కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ వినతిని పరిశీలించి రెండు రోజుల కిందటే నిధుల పంపిణీకి ఆమోదం తెలి పింది. దీంతో రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి అడ్డంకులు తొలగిపొయినా, అసలు పరీక్ష ఇప్పుడే మొ దలైంది. ఒకేసారి 7700కోట్లు రైతుల బ్యాంకు ఖాతా కు జమచేయాల్సి రావటం అటు అర్థిక శాఖకు , ఇటు బ్యాకింగ్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది. అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వేర్వేరు భ్యాంకుల్లో ఖాతాలు పెట్టుకున్న 70లక్షల మంది రైతులకు సంబం ధించిన ఖాతాలకు నిధులు చేయాల్సి కూ డా సవాల్‌గా మారింది.
సాధారణ పరిస్థితుల్లో అయితే ప్రభుత్వం ఎకరం రైతులతో నిధుల జమను ప్రారంభించి ఆ తరువాత రోజుకు ఎకరం చొప్పున పెంచుకూంటు పోయేది. ఈసారి వరుస సెలవులు అటువంటి అవకాశం లేకుండా చేశాయి. ఈ నెల 25నుంచి 27వరకూ వరుస సెలవులు వచ్చిపడ్డాయి. కేవలం ఒక్కరోజు మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. అది కూడా ఈ నెల 28 న మాత్రమే బ్యాంకులు పనిచేయనున్నాయి. ఎన్నికల సంఘం ఆదేశాల రాష్ట్ర వ్యవసాయశాఖ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అర్హతగల రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టింది.మళ్లీ ఆమరు నాడు సెలవు రోజు కావటం, ఈ నెల 30న శాసనసభ ఎన్నికల పోలింగ్ దృష్టా ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు రోజు ప్రకటించింది. దీంతో రైతుబంధు పథకం కింద నిధుల పంపిణీకి ప్రభుత్వం మిషన్‌మోడ్ కింద చర్యలు చేపట్టాల్సి