Wednesday, January 22, 2025

సమతామూర్తి స్ఫూర్తి సార్వజనీనం

- Advertisement -
- Advertisement -

Everything is ready for Sri Ramanuja Sahasrabdi celebrations

ఫిబ్రవరి 2 నుంచి 14వరకు ముచ్చింతల్‌లో శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం
5వేల మంది రుత్విక్కులతో మహాక్రతువు
10కోట్ల అష్టాక్షరి మహామంత్ర పారాయణం
216 అడుగుల శ్రీమద్రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ, త్రిదండి చినజీయర్ స్వామి పర్యవేక్షణలో సమారోహం ఏర్పాట్లు
హాజరుకానున్న రాష్ట్రపతి సహా ప్రముఖులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని ఆధ్యాత్మిక పరివర్తనదివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధమైయ్యాయి. దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటు అతిరథ మహారథులు ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిన్న జీయర్ స్వామి ప్రముఖులకు స్వయంగా ఆహ్వాన పత్రికలను పంచారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో 216 అడుగుల విశిష్టాద్వైతం గురించి ‘మనతెలంగాణ ప్రతినిధి’తో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ రామానుజాచార్యులు గొప్ప తత్వవేత్త, త్రిమతాచార్యులలో ద్వితీయుడన్నారు.

కర్తవ్యదీక్షలో ప్రదర్శించవలసిన ధైర్యంతో పాటు దేవుని పై చూపవలసిన అనస్యసామాన్యమైన నమ్మకానికి, సాటిలేని భక్తికి రామానుజాచార్యుని జీవితం చక్కని ఉదాహరణని చిన్నజీయర్ స్వామి తెలిపారు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సప్రమాదాయలన్ని అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేనవి, ఈ మతాలు దేవుడిని కొలవడానికి వచ్చిన వేర్వేరు మార్గాలేకాని, వైదికమతానికి బదులుగా పఠించవలసినవికాదని రామానుజాచార్యులు నిరూపించాడని వివరించారు. ఆదిశంకరుని అద్వైత సిద్దాంతంలోని సొగసులు సరిదిద్ది విశిష్టాద్వైత సిద్దాంతాన్ని రామానుజాచార్యులు ప్రతిపాదించారని, ప్రస్ధాన త్రయాన్ని సాధారణ జనానికి అందించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.

అలాగే వేదవ్యాసుని అభిమతానుగుణంగా బ్రహ్మసూత్రానికి పరిపూర్ణ వ్యాఖ్యగా శ్రీ భాష్యాన్ని అందించిన శ్రీ సాంప్రదాయ ప్రవర్తకులు శ్రీ రామానుజాచార్యులన్నారు. గీతాభాష్యము, తర్కభాష్యము, వేదార్ధ సంగ్రహము, న్యాయమృతము, వేదాంత ప్రదీపము, వేదాంత తత్వసారము, నారదీయ పంచరాత్రాగమము, రంగనాధస్తవము, గద్యత్రయములతో పాటు మరిన్ని గ్రంధాలను ఆయన రచించారన్నారు. ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, ఆ పని వల్ల తనకు కీడు జరిగినా పదిమందికి జరిగే మేలుకై తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లే దని రామానుజాచార్యులు నిరూపించాడన్నారు. సమాజ శ్రేయస్సు ముఖ్యమ ని వ్యక్తిగత శ్రేయస్సు కాదని రామానుజా చార్యులు తనగురువు తనకు చెప్పి న తిరుమంత్రాన్ని ప్రజలందరికి తెలియజెప్పాడని తెలిపారు.

తాను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన సిద్దాంతాన్ని వ్యతిరేకించినవారిని సైతం గౌరవించిన సమతా మూర్తి రామానుజాచార్యులని ఆయన విశిష్టతను తెలియజేశారు.దేవుని పూజించటం, మేష్టాన్ని సాధించటం మానవునిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు ఆ హక్కుని దిక్కురించే అధికారం ఎవ్వరికి లేదని, దేవుని దృష్టిలో అందరూ సమానమేనని అనాడే ఆయన నిరూపించాడన్నారు. గురువులు చెప్పినంత మాత్రాన అదే నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదని, వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది తప్పో, ఒప్పో నిర్ణయంచుకోవడం పాపం కాదని రామానుజాచార్యులు అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సెలవిచ్చారు.

ముచ్చింతలో ఆధ్యాత్మిక శోభ

రంగారెడ్డి జిల్లా ముచ్చింతలలోని ఆధ్యాత్మిక పరివర్తనదివ్యక్షేత్రంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు సర్వం సన్నద్ధమైయ్యాయి. దేశ రాష్ట్రపతి, ప్రధానితో పాటు అతిరథ మహారథులు ఈ ఉత్సవాలకు హాజరు కానున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చిన్న జీయర్ స్వామి ప్రముఖులకు స్వయంగా ఆహ్వాన పత్రికలను పంచారు. చిన్న జీయర్ స్వామి ఆధ్యాత్మిక పరివర్తన క్షేత్రంలో 216 అడుగుల రామానుజ విగ్రహ ఆవిష్కరణతో పాటు 108 విష్ణు ఆలయాలను సైతం ప్రతిష్టించనున్నారు.

దివ్యక్షేత్రంలో అడుగుపెట్టగానే అష్టదళ పద్మాకృతిలో ఉండే 45 అడుగుల ఎత్తుతో కూడిన ఫౌంటెయిన్ దర్శనమిస్తుంది. అలా గే పద్మ పత్రాలు విచ్చుకునేలా దాదాపు రూ. 25 కోట్ల రూపాయల వెచ్చించి ఈ ఫౌం టెయిన్ నిర్మించారు. పద్మపత్రాల మధ్య నుంచి నీళ్లు, రామానుజులను అభిషేకిస్తున్న భావన భక్తులకు కలిగించేలా ఫౌంటెయిన్ ఏర్పాటు చేయడం అ ద్భుతం. అలాగే రామనుజుల కీర్తనలు శ్రావ్యంగా వినిపించేలా, సూర్యాస్తమ యం తరువాత రామానుజులు ప్రబోధించిన సమానత్వ ఘట్టాలు మ్యూజిక్ తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించనున్నారు. మహోన్నత క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సుమారు 1,200 మంది శిల్పులు, ఇతర చేతివృత్తి కళాకారులు రాజస్థాన్‌లో లభించే పింక్ గ్రానైట్‌తో చేసిన ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. రామానుజుల వారి జీవిత విశేషాలు ప్రతిబింబించేలా మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. దివ్యక్షేత్రంలోఏర్పాటు చేసిన ఉద్యానవనాలు, విభి న్నరంగులతో కూడినలక్షలాది మొక్కలు ఉద్యానవనాల్లో ఏర్పాటు చేశారు.

ప్రపంచంలో రెండోది

ప్రపంచవ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఈ సమతా మూర్తి విగ్రహం రెండోది కావడం విశేషం. సమతామూర్తి విగ్రహంలో పద్మపీఠంపై పంచలోహాలతో తయారు చేసిన 36 శంఖు, చక్రాలతో పాటు ఏనుగు ఆకృతులు అమర్చారు. గర్భగుడిలో స్తంభాలపై చెక్కిన ఆకృతులు, మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బం గారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా దర్శనమిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఐదు వేల మంది రుత్వికులు

శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల కోసం దేశం నలుమూలల నుంచి 5వేల మంది రుత్వికులు విచ్చేయనున్నారు. ఈక్రమంలో ఫిబ్రవరి 2 నుంచి 14వ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 144 యాగశాలల్లో విశ్వశాంతి కోసం సహస్ర కుండాత్మక మహావిష్ణు యాగం చేపడుతున్నారు. నాలుగు దిక్కులలో 36 చొప్పున యాగశాలల చొప్పున మొత్తం యాగశాలల్లో 114 చోట్ల యాగాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సంకల్ప మండపం, అంకురార్పణ మండపం, నిత్యపారాయణ మండపం, రెండు ఇష్టిశాలల్లోనూ 1,035 హోమకుండాల నిర్మాణం పూర్తికావచ్చింది. ఉత్సవాల సందర్భంగా నిత్యం కోటిసార్లు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం జపించనున్నా రు. హోమంలో 2లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగించనున్నారు.

రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన స్వచ్ఛమైన నెయ్యిని ఇందుకు వినియోగిస్తున్నారు. అలాగే ఆవు పేడతో తయారు చేసిన కట్టెలు, శ్రేష్ఠమైన రావి,జువ్వీ, మేడి, మామిడి వాటితో వచ్చే కట్టెలతో సహస్ర కుండాత్మక యాగ కార్యక్రమాన్ని ఉపయోగించనున్నారు. ప్రతి హోమకుండం వద్ద ముగ్గురు రుత్వికులతో పాటు పండితులు యాగాన్ని జరిపించనున్నారు. సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. యాగం చేసే వారిని మినహా మిగిలిన వారిని యాగశాల లోపలికి అనుమతించకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు, ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరిగే యాగాలకు దాదాపు లక్షమంది వరకు హాజరుకానున్నట్లు నిర్వహకులు అంచనా వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News