Saturday, November 23, 2024

దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -
  • ఏర్పాట్లు చేసిన మేడ్చల్ జిల్లా యంత్రాంగం
  • 21 రోజుల పాటు షెడ్యూల్ మేరకు వేడుకలు

మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సర్వం సిద్దమైంది. ఈనెల 2 నుండి 22వ తేదీ వరకు నిర్వహించే వేడుకలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అధికారులతో నిరంతరం సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఉత్సవాల కోసం రాష్ట్ర రవాణా, రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి బోయి విజయేంద్రను ప్రభుత్వం జిల్లా ప్రత్యేక అధికారిగా నియమించింది. జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో జరిగే వేడుకల పర్యవేక్షణకు అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం రూపొందించిన షెడ్యూల్ ప్రకారం 21 రోజుల పాటు జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. క్లస్టర్ పరిధిలోని గ్రామాలలో పెద్ద ఎత్తున రైతు దినోత్సవాలు, ఊరూరా చెరువుల పండుగను నిర్వహించనున్నారు.

చెరువుల వద్ద బతుకమ్మ, సాంస్కృతిక కార్యక్రమాలు, కట్ట మైసమ్మ పూజలు, బోనాలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 2014కు పూర్వం, ఆ తర్వాత సాధించిన ప్రగతిపై నియోజకవర్గం, గ్రామ, మండలాల వారిగా ప్లెక్సీలు ఏర్పాటు చేసి, కరపత్రాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు.

వేడుకలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ముస్తాబు

తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ముస్తాబైంది. మొదటి రోజు శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో జరిగే ప్రారంభ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. సమీకృత కలెక్టరేట్ భవనాన్ని విద్యుత్ దీపాలు, పూలతో సుందరంగా అలంకరించారు. జిల్లా నలు మూలల నుండి ప్రజలు తరళివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు.

వేడుకలలో మఖ్య అతిధి ప్రసంగించేందుకు వేదికను సిద్దం చేశారు. వేడుకలలో కవాతు నిర్వహించేందుకు పోలీసులు పలు దఫాలుగా రిహార్సల్ నిర్వహించారు. ఉదయం 9 గంటలకు జరుగు వేడుకలలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. మంత్రి, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు పురస్కారాలు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు.

సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలి: కలెక్టర్

అధికారులు సమన్వయంతో పనిచేసి తెలంగాణ రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలపై జిల్లా అదనపు కలెక్టర్లు ఏనుగు నరసింహారెడ్డి, అభిషేక్ అగస్తా, జిల్లా అధికారులు, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట అవతరణ దశాబ్ధి ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 21 రోజుల పాటు జరిగే కార్యక్రమాలను ప్రణాళికల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉంటూ శాఖల వారిగా నిర్వహించే కార్యక్రమాలకు ఒక రోజు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, జిల్లా పరిషత్ సీఈవో దేవసహాయం, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి పద్మజారాణి, కీసర ఆర్డీఓ రవి, తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News