Tuesday, January 21, 2025

విజయ్ దేవరకొండ కొత్త సినిమా షూటింగ్‌కి అంతా రెడీ

- Advertisement -
- Advertisement -

విజయ్ దేవరకొండ, పరశురామ్ కలిసి సినిమా మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో రెండో సినిమాను ఈ మధ్యే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజయ్ సరసన మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో రాబోతోన్న ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ పై ఇప్పటికే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను తెరకెక్కించబోతోన్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ల వేట కూడా పూర్తయిందట. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతోన్నామని మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ ఓ ఫోటోను వదిలింది. ఇందులో టీం అంతా కూడా నవ్వులు చిందిస్తూ కనిపిస్తోంది. దిల్ రాజు, పరుశురామ్ ఇతర సాంకేతిక నిపుణులు లొకేషన్ల వేటను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 54 వ చిత్రంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది ఈ చిత్రం. ఇక త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News