Monday, December 23, 2024

ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలా సిద్ధంగా ఉండాలి

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్‌లో గల ఈవీఎం గోదామును ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా పూర్తి స్థాయిలో ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని తెలిపారు. ఈవీఎం, బ్యాలె ట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ పాట్‌ల ప్రాథమిక స్థాయి పరిశీనలో భాగంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమ క్షంలో పరిశీలించడం జరిగిందన్నారు.

ఈవీఎం గోదాము సీసీ కెమెరా పర్యవేక్షణలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల డీటీ శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News