Monday, January 20, 2025

ఆధారాలున్న కానరాని ప్రభుత్వ ఆచరణ

- Advertisement -
- Advertisement -

ముప్కాల్ : తమ పార్టీ నాయకుడు మల్లికార్జున దగ్గర క్రషర్‌కు సంబంధించి అన్ని ఆధారాలు సమాచార హక్కు ద్వారా ఉన్నాయని, కానీ ప్రభుత్వం నుండి ఆచరణ ఎక్కడుందని బిజెపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీను ప్రశ్నించారు. శనివారం జిఎన్‌ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నాయకుడు ఎటువంటి అసభ్యకరమైన మా టలు మాట్లాడలేదని, బిఆర్‌ఎస్ పార్టీ వాళ్లు కూడా తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటి గురించి మాత్రమే మాట్లాడాలని ఇష్టం వచ్చిన పదజాలాతో మాట్లాడడం సబవు కాదని అన్నారు. 20 కోట్లు అనేది వారం రోజుల ప్రభుత్వ పనుల కోసం మాత్రమే శ్రీకాంత్‌రెడ్డి ఏడికి చెప్పింది. 400 కోట్ల రూపాయల పనులు ఏడు నెలలని, మీక్రషర్ మీ రోడ్డు పనులు జరగడానికి మాత్రమే ఏద్దేవా చేశారు. ఎంపిని విమర్శించే హక్కు తమకు లేదని, పసుపు బోర్డు కంటే పెద్ద బోర్డు ఎప్పుడో తీసుకొచ్చారని అన్నారు. అన్నపూర్ణమ్మను విమర్శించే స్థాయి ఏ ఒక్కరికి లేదన్నారు. క్రషర్‌కు సంబంధించిన కరెంట్ బిల్లు తమ నాయకుడు ప్రశ్నించిన తర్వాతే కట్టారని తెలిపారు. అందరం బిజెపి నాయకుడు గడ్డం సంతోష్ మాట్లాడుతూ తాను గాని తన కుటుంబం గానీ ఎక్కడైనా గంజాయి అమ్మినట్లు నిరూపించగలిగితే గాంధీ వద్దకు బహిరంగ క్షమాపణ చెప్తానని అన్నారు. అభివృద్ధి అంటే రోడ్డు మాత్రమే అని, డబుల్ బెడ్ రూమ్‌ల నిర్మాణం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం ఎటు పోయానని విమర్శించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News