Monday, December 23, 2024

ఇసుక రీచ్‌ల రద్దైన ఆధారాలు చూపాలి

- Advertisement -
- Advertisement -

జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య

Evidence of cancellation of sand ridges
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి : ఇసుక రీచ్‌లు రద్దు చేసినప్పుడు సరైన ఆధారాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియం లో డిఆర్‌ఓ రమాదేవి, జిల్లా మైనింగ్ ఏడి రఘుబాబుతో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గో దావరి పరివాహక ప్రాంతాల్లో వరద ప్రవాహం వ లన పట్టా భూములలో సొసైటీ భూములలో ఉన్నా ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి ప్రజల ప్రయోగార్ధం ఆయా శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా ప్రభుత్వ నిబంధనల మేరకు 7 ఐటిడి ఏ ట్రైకార్ కార్పోరేషన్ సంస్థ ద్వారా డ్రాప్ట్ పబ్లికేషన్ ఇచ్చినప్పటికీ ఫారెస్ట్ అధికారుల వద్ద ఖచ్చితమైన ఆధారాలు ఉన్నట్లు అయితే వాటిని బుధవారం జరి గే స్థాయి సమావేశానికి తీసుకురావాలని అన్నారు. మొత్తం 262 దరఖాస్తులు రాగా అందులో 139 ఫైనల్ కాగా అవి 88 సొసైటీస్, 51 పట్టా లాండ్స్ ఇసుక క్వారీల ధరఖాస్తులు వచ్చాయని ఇందులో 123 పెండింగ్ దరఖాస్తులను త్వరగా జాయింట్ తనిఖీలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని, 7 సొసైటీలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా 6 ఇసుక బియారింగ్ ఏరియాలను గుర్తించడం జరిగిందని రెండు మంగపేట, 4వెంకటాపురం లలో ఉన్నాయని వాటి కి గుగుల్ ఎర్త్ ఇమేజెస్ చుట్టూ బౌండరీలు గుర్తించి రిపోర్ట్ తయారు చేసి పంపాలని అన్నారు. గ్రామ స భలు ద్వారా సొసైటీలను గుర్తించాలని అన్నారు. ఇ రిగేషన్‌శాఖ అధికారులు పంపిన నివేదికలు పలు మార్లు మార్పులు చేస్తూ సమర్పిస్తున్నారని నివేదిక లు వెల్లడించే ముందు జాగ్రత్తగా పరిశీలించి సమర్పించాలని, ఏదైనా పొరపాట్లు జరిగితే శాఖా పరమైన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్ లను రద్దుచేసినట్లయితే ఎందుకు రద్దు చేశారో ఖచ్చితమైన ఆధారాలు చూపాలని ఫారెస్ట్ అ ధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ ఓ రమాదేవి, మైనింగ్ ఏడి రఘుబాబు, డిసిఓ సర్దా ర్ సింగ్, పిసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్, డిఐ రాజనర్సయ్య,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉద్యోగుల బదిలీలు ప్రశాంతంగా ముగిశాయి.. జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య …
రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థననుసరించి ప్రభుత్వ నిబంధనలమేరకు ఉద్యోగుల బదిలీలు ప్ర శాంతంగా ముగిశాయని, ఇతర జిల్లాల నుండి జి ల్లాకు 1170 మంది ఉద్యోగులను బదిలీలపై వచ్చారని, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు 1165 మంది విధుల్లో చేరారని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల చేపట్టిన బదిలీల్లో జిల్లాకు వచ్చిన అధికారులు, ఉద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేశారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News