Wednesday, January 22, 2025

హారర్ బ్యాక్‌డ్రాప్‌లో…

- Advertisement -
- Advertisement -

 

వెంకట్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ఈవిల్ లైఫ్’. రాణి స్వాతి కథానాయిక. బ్లూ మౌంటెన్ మూవీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను టి.ప్రసన్నకుమార్ విడుదల చేశారు. రామసత్యనారాయణ, ఆచంట గోపీనాథ్ పాటలను విడుదల చేశారు. ప్రన్నకుమార్ మాట్లాడుతూ “ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. హీరో, దర్శకత్వం, ప్రొడక్షన్ అన్నీ తానే అయ్యి సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు వెంకట్.

మారుతి తీసిన ప్రేమకథాచిత్రమ్ ఎలాగైతే సింపుల్‌గా హిట్ అయిందో ఈ చిత్రం కూడా అలాగే హిట్ అవుతుంది. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో ఉన్న ఈ సినిమాలో చక్కని ఫీల్ ఉంటుంది. వైజాగ్ శంకర్ ఈ సనిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు” అని అన్నారు. హీరో, దర్శకనిర్మాత వెంకట్ మాట్లాడుతూ “సినిమా అంటే ప్యాషన్‌తో ఇండస్ట్రీలోకి వచ్చా. అన్ని నేనే అయ్యి సినిమా పూర్తి చేశా. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశా. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రి బాలాజి, గౌతంరాజు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News