Thursday, January 23, 2025

ఈవిల్ సైడ్ అఫ్ ‘స్పార్క్ లైఫ్’ విడుదల..

- Advertisement -
- Advertisement -

‘స్పార్క్ లైఫ్’ వంటి భారీ బడ్జెట్ చిత్రంతో యంగ్ హీరో విక్రాంత్ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోన్నారు. విక్రాంత్ ఈ సినిమాతో హీరోగా మాత్రమే కాకుండా కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, దర్శకుడిగానూ ఎంట్రీ ఇవ్వబోతోన్నారు. డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ మీద రాబోతోన్న ఈ చిత్రంలో మెహరీన్, రుక్సర్ థిల్లాన్‌‌లు హీరోయిన్లుగా నటించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఐదు భాషల్లో ఈ చిత్రం ఈనెల 17న విడుదల కాబోతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం నుంచి ఈవిల్ సైడ్ అఫ్ స్పార్క్ లైఫ్ పేరుతో స్నీక్ పీక్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో విక్రాంత్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నుంచి ఇప్పటివరకు లవ్, క్రైమ్, యాక్షన్ చూపించాం. ఇప్పుడు ఈవిల్‌ను చూపించాం. మెహరీన్, రుక్సర్ ఈ సినిమాకు వంద శాతం న్యాయం చేశారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెహరీన్, రుక్సర్ థిల్లాన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News