Sunday, January 19, 2025

ఉప ఎన్నికకు ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

27,28 తేదీల్లో సిబ్బందికి రెండో విడత శిక్షణ
ఇప్పటివరకు 12 కేసులు నమోదు, రూ.2.49 కోట్ల
నగదు స్వాధీనం 36మంది అరెస్టు, 77కేసులు
నమోదు: సిఇఓ వికాస్‌రాజ్ ఫిర్యాదులకు
టోల్‌ఫ్రీ నెంబర్ 08682-230198

ప్రారంభమైన ఇవిఎంల పరిశీలన

Local Bodies Quota MLC Election Schedule Release

మన మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సిఇఒ)వికాస్‌రాజ్ తెలిపారు. ఇవిఎంలు, పోస్టల్ బ్యాలెట్ల కోసం బ్యాలెట్ పేపర్ల ముద్ర పూర్తయిందని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఇవిఎంల పరిశీలన ప్రారంభమైందని, 35 శాతం అదనపు ఇవిఎంలు, వివిప్యాట్‌లను రిజర్వ్ అధికారికి కేటాయించామని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ఈ నెల 27,28న రెండో విడత శిక్షణ ఇస్తామని, 25 శాతం  రిజర్వ్‌తో పాటు అ వసరమైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమించామని మీడియాకు తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 12 కేసులు నమోదు చేశామని, రూ. 2,49,65,960- నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1483.67 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని, 36 మందిని అరెస్టు చేసి 77 కేసులు నమోదు చేశారని అన్నారు.

మునుగోడు నియోజకవర్గంలో 80 ఏళ్లు పైబడిన 345 మంది ఓటర్లు, 394 మంది దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి నిర్ణీత సమయంలోగా ఫారం 12డి సమర్పించారని సిఇఒ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా సీనియర్ సిటిజన్లు (80 ఏళ్లు పైబడిన వారు), దివ్యాంగుల ఓటర్లు పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి షెడ్యూల్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 171బి ప్రకారం, ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నగదు లేదా వస్తు రూపంలో ఇచ్చినా లేదా స్వీకరించినా శిక్షార్హులవుతారని చెప్పారు. అందుకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించబడతాయని వివరించారు. అలాగే ఐపిసి సెక్షన్ 171సి ప్రకారం, ఎవరైనా అభ్యర్థిని లేదా ఓటరును లేదా మరే ఇతర వ్యక్తిని ఏ విధమైన బెదిరిస్తే ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయని చెప్పారు. లంచం ఇచ్చేవారిపైనా, తీసుకునే వారిపైనా కేసులు నమోదు చేయడంతోపాటు ఓటర్లను బెదిరించడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని కోరారు.

ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

ఓటర్లకు నగదు పంపిణీ, ఇతర సమాచారం అందజేయడానికి 24 గంటల పాటు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్ 0868-2 230198ను ఏర్పాటు చేశామని సిఇఒ వికాస్ రాజ్ తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనల ఉల్లంఘిస్తే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. 14 మంది సభ్యుల బృందం 24 గంటలూ ఫిర్యాదులను పర్యవేక్షిస్తుందని అన్నారు. నలుగురు సభ్యులు ఫిర్యాదులను స్వీకరించడానికి,మిగిలిన 10 మంది సభ్యులు గ్రామ స్థాయి నుండి ఏదైనా ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం సేకరిస్తారని తెలిపారు. అధికారులు ఎన్నికల నిబంధనలకు సంబంధించిన సమాచారాన్ని ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలో కరపత్రాలను ప్రచురించాలని, ప్రముఖ ప్రదేశాలలో ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా పంపిణీ చేయాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News