నల్గొండ:ఓటర్లకు అవగాహన కలిగించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ప్రారంభించారు. గురువారం కలెక్టరేట్లో తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలు – 2023 దృష్ట్యా ఈవీఎం, వివి ప్యాట్‌లపై ఓటర్లకు అవగాహన కలిగి ంచడానికి ఈవీఎంల ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభి ంచి ఆయన మాట్లాడారు. ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని. ఈ మిషన్ ఓట్లు వేయడానికి, ఓట్ల లెక్కించడానికి ఉపయోగిస్తారని అన్నారు. ఈవీఎం రెండు యూనిట్లైన కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్లతో అనుసంధానం చేస్తారన్నారు.
మిషన్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు లేదా గుర్తుల పక్కన ఉన్న బటన్ నొక్కి ఓటు హక్కును ఉపయోగించుకుంటారని తెలిపారు. వివిపాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అన్నారు. ఓటింగ్ యంత్రంతో అనుసంధానమై ఓటర్లు తమ ఓటు సరిగ్గా వేయబడిందని నిర్ధారించడానికి హాయపడుతుందన్నారు. ఇందులో అభ్యర్థి పేరు, పార్టీ, గుర్తు కలిగి ఉంటుందన్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నందున అర్హత గల ప్రతి ఓటర్ ఓటర్ జాబితాలో ఓటరుగా నమోదు చేసుకో వాలని,ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డెమో ఈవిఎం యంత్రం పై ఓటు వేసే విధానాన్ని స్వయంగా బ్యాలెట్ పై అదనపు కలెక్టర్ ఓటు వేసి చూపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎఒ మోతీలాల్,కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, ఎన్నికల డి.టి. విజయ్, తదితరులు పాల్గొన్నారు.