గువహతి: బిజెపి అభ్యర్థి కారులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ను అధికారులు తరలిస్తున్నారనే అంశంపై వివాదం నెలకొంది. అస్సాంలోని రతాబరి సీటులోని ఒక పోలింగ్ కేంద్రంలో రీపొలింగ్ పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పోలింగ్ సందర్భంగా విధులు నిర్వర్తించిన నలుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. ఈ సంఘటన కరీమ్‌గంజ్ జిల్లాలో హింసకు దారితీసింది. ఈ కారు పఠర్కండిలోని బిజెపి పోటీదారు కృష్ణేండు పాల్ భార్యకు చెందినది. అధికార బిజెపి ఆగడాలపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేశారు. అస్సాంలో గురువారం రెండో దశ పోలింగ్ జరిగింది. 77శాతం పైగా ఓటింగ్ నమోదైంది. అయితే, ఈవీఎంలు ట్యాపరింగ్ కాలేదని ఇసి స్పష్టం చేసింది. బిజెపి ఓటమి భయంతో ఇలా చేస్తోందని, సదురు అభ్యర్థి అనర్హుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
Breaking : Situation tense after EVMs found in Patharkandi BJP candidate Krishnendu Paul’s car. pic.twitter.com/qeo7G434Eb
— atanu bhuyan (@atanubhuyan) April 1, 2021