Monday, January 20, 2025

రాబోయే ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎంలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం ఈవీఎం గోడౌన్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల ఫస్ట్‌లెవల్ చెకింగ్ (ఎఫ్‌ఎల్‌సీ) తనిఖీ చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈవీఎం మెషిన్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, టైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్సో, కలెక్టరేట్ ఈవో జగత్‌సింగ్, డిప్యూటీ తహసిల్దార్ (ఎలక్షన్స్) తహసిన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు బిఆర్‌ఎస్ శ్రీనివాస్, కాంగ్రెస్ ఎం.మోహన్, బీజేపీ నాంపల్లి శ్రీనివాస్, బీఎస్పీ జి అనిల్‌కుమార్, ఎంఐఎం అమీన్, టీడీపీ ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News