Saturday, November 23, 2024

మ్యూజిక్‌ స్కూల్ ‘ఏవో సరాగాలు..’సాంగ్ రిలీజ్.. సూపర్బ్ రెస్పాన్స్

- Advertisement -
- Advertisement -

ఇళయరాజా మ్యూజిక్‌ అంటే ఆబాలగోపాలం అలర్ట్ అయిపోతుంది. మెలోడీస్‌తో పాటు ఫుట్‌ ట్యాపింగ్‌ పాటలకు అద్భుతమైన స్వరాలిస్తారు మేస్ట్రో. ఇప్పుడు లేటెస్ట్‌గా మ్యూజిక్‌ స్కూల్లో మరోసారి తన మార్కు ట్యూన్లతో ఆకట్టుకుంటున్నారు లెజండరీ మ్యూజిక్‌ డైరక్టర్‌ ఇళయరాజా. మ్యూజిక్‌ స్కూల్‌ నుంచి ఆల్రెడీ విడుదలైన ఫుట్‌ ట్యాపింగ్‌ ఫస్ట్ సాంగ్ ‘చ‌దువే చదువంటారు’ కి చాలా మంచి స్పందన వచ్చింది. ఆ జోష్‌తోనే జబర్దస్త్ మెలోడీ, రొమాంటిక్ సాంగ్ ‘ఏవో సరాగాలు’ను మేకర్స్ విడుదల చేశారు. ఏప్రిల్‌ 12, బుధవారం రోజు హిందీ, తెలుగు, తమిళ్‌లో విడుదలైన ఈ పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. శ్రియ శరణ్‌, శర్మన్‌ జోషి మీద ఈ పాటను పిక్చరైజ్‌ చేశారు. ఇళయరాజా స్వరపరిచారు. ‘ఏవో సరాగాలు..’ పాటకు రెహమాన్ సాహిత్యాన్ని అందించగా శ్రేయా ఘోషల్‌, జావేద్‌ అలీ ఆలపించారు. ఆడమ్‌ ముర్రే కొరియోగ్రఫీ చేశారు.

Also read: ‘సైంధవ్’ నుంచి మనోజ్ఞగా శ్రద్ధా శ్రీనాథ్‌ పరిచయం

మ్యూజిక్‌ స్కూల్లో మొత్తం పదకొండు పాటలున్నాయి. ఐఏయస్‌ ఆఫీసర్‌గా పనిచేసి, ఫిల్మ్ మేకర్‌గా మారిన పాపారావు బియ్యాల మ్యూజిక్‌ స్కూల్‌ సంగీతం గురించి మాట్లాడుతూ ‘‘సున్నితమైన కథాంశంతో మ్యూజిక్‌ స్కూల్‌ తెరకెక్కిస్తున్నాం. మన విద్యావిధానంలో విద్యార్థుల మీద సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. కానీ ఎలా ఉండాలనే విషయాన్ని చెబుతూ సినిమా చేశఆం. ఇందులో మొత్తం పదకొండు పాటలున్నాయి. వాటిలో మూడు పాటలు మరింత హృద్యంగా, మన భారతీయ సంగీతాన్ని ప్రతిధ్వనించేలా ఉంటాయి’’ అని అన్నారు. ఈ సినిమా గ్రాండియర్‌ని తమ లెన్సుల్లో పొందుపరిచి కెమెరాను అద్భుతంగా డీల్‌ చేశారు సినిమాటోగ్రాఫర్‌ కిరణ్‌ డియోహన్స్.

శ్రియా శరన్, శర్మన్ జోషి, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒజు బారువా, గ్రేసీ గోస్వామి ప్రధాన భూమికల్లో కనిపిస్తారు. బెంజమిన్‌ గిలాని, సుహాసిని మూలే, మోనా అంబిగోయంకర్‌, లీలా సామ్‌సన్‌, బగ్స్ భార్గవ, వినయ్‌ వర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వాక్వార్‌ షేక్‌, ఫణి బాల నటులుగా పరిచయమవుతున్నారు. యామని ఫిల్మ్స్ సమర్పిస్తున్న సినిమా ఇది. హిందీ, తెలుగులో ఏకసమయంలో చిత్రీకరించారు. తమిళ్‌లో అనువాదం చేశారు. ఈ ఏడాది మే 12న విడుదల కానుంది. హిందీలో పీవీఆర్‌ సంస్థ, తెలుగులో దిల్‌రాజు విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News