అస్సాంలో వ్యవసాయ అభివృద్ధి అధికారుల (ఎడిఒల) నియామకానికి సంబంధించిన నగదుకు ఉద్యోగాల కేసు సందర్భంగా ఒక ప్రత్యేక న్యాయస్థానం అస్సాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపిఎస్‌సి) మాజీ చైర్మన్ రాకేష్ పాల్‌కు సోమవారం 14 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. మరి ఇద్దరు ఎపిఎస్‌సి సభ్యులు బసంత్ కుమార్ డోలె, సమెదుర్ రెహ్మాన్‌కు పది సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు,
ఇంకా 29 మంది అధికారులు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించనున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి దీపంకర్ ఠాకురియా తన ఉత్తర్వులో తెలియజేశారు. ఎడిఒ నియామక పరీక్షకు హాజరైన అభ్యర్థుల మార్కులను తారుమారు చేసిన కేసులో డోలె, రెహ్మాన్, ఇతర అధికారులతో పాటు పాల్‌ను దోషిగా కోర్టు నిర్ధారించింది. పరీక్షకు అర్హత పొందలేకపోయిన ఒక అభ్యర్థి ఫిర్యాదు నమోదు చేసి, కేసు దాఖలు చేశారు. ఆర్థిక లావాదేవీల కింద మరొక అభ్యర్థి మార్కులను హెచ్చించినట్లు ఆ అభ్యర్థి ఆరోపించారు.