Monday, December 23, 2024

లలిత్ మోడీ నా కెరీర్ నాశనం చేస్తానన్నాడు: టీమిండియా ఆటగాడి ఆరోపణ

- Advertisement -
- Advertisement -

తన కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడని.. ఐపిఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీపై టీమిండియా బౌలర్ ప్రవీణ్ కుమార్ సంచలన అరోపణలు చేశాడు. ఐపిఎల్ తొలి సీజన్ లో తనపై లలిత్ మోడీ బెదిరింపులకు పాల్పడడ్డాని ప్రవీణ్ కుమార్ చెప్పాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరఫున తాను ఆడాలనకున్నానని.. కానీ, లలిత్ మోడీ.. అందుకు ఒప్పుకోకుండా తాను చెప్పినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడాలని ప్రెజర్ పెట్టాడని తెలిపాడు. అందుకు ఒప్పుకోకపోతే తన కెరీర్ ను నావనం చేస్తానని బెదిరించాడని ఆరోపించాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పెద్ద దూమారం లేపుతున్నాయి. దీనిపై లలిత్ మోడీ ఇంకా స్పందిచలేదు.

కాగా, ఐపిఎల్ ప్రవీణ్ కుమార్..బెంగళూరు, పంజాబ్, హైదరాబాద్, గురజరాత్ ప్రాంచైజీలకు ప్రాతినిద్యం వహించాడు. తర్వాత 2018లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News