- Advertisement -
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని , వెంటిలేషన్ పైనే చికిత్స అందుతోందని వైద్యులు సోమవారం వెల్లడించారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు కోల్‌కతా లోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. శనివారం నుంచి అదే పరిస్థితి కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.
సోమవారం ఉదయం ఛాతీకి సిటి స్కాన్ తీయడమైందని, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని సీనియర్ డాక్టర్ చెప్పారు. మరికొన్ని పరీక్షలు చేశాక ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ తీవ్రత ఎలా ఉందో తెలుస్తుందని, ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయిస్తామని డాక్టర్ చెప్పారు. రక్తపోటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు సంతృప్తికరం గానే ఉన్నాయన్నారు. అయినా ఆయనింకా ప్రమాదం నుంచి బయటపడలేదని తెలిపారు.
- Advertisement -