Wednesday, January 22, 2025

హేమంత్ సోరెన్‌కు 5 రోజుల ఇడి కస్టడీ

- Advertisement -
- Advertisement -

రాంచి: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఐదు రోజుల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీకి అప్పగిస్తూ రాంచిలోని పిఎంఎల్‌ఎ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేసిన వెంటనే భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బుధవారం రాత్రి ఆయనను ఇడి అరెస్టు చేసింది. రాంచిలో జరిగిన భూ కుంభకోణంతో సోరెన్‌కు ప్రమేయం ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నట్లు ఇడి ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను హేమంత్ సోరెన్ ఖండించారు. తనకు సంబంధం లేని కేసులో ఇడి తనపై ఆరోపణలు చేస్తోందని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News