Sunday, June 30, 2024

ఓమ్నీ వ్యాన్ నడిపిన మాజీ సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ అధినేత్ కెసిఆర్ ఓమ్నీ వ్యాన్ నడుపుతూ ఎర్రవల్లి పొరుగు గ్రామాలను సందర్శించారు. రోడ్లపై కనబడిన వారిని కెసిఆర్ ఆప్యాయంగా పలకరిస్తూ తన వాహ్నాన్ని ముందుకు పోనిచ్చారు. కెసిఆర్ పలకరింపులతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ వ్యవసాయ క్షేత్రం సమీపంలో ఉన్న పాండురంగ డ్యామ్ దగ్గరికి వెళ్లి నీటిమట్టాన్ని గమనించారు. మార్గమధ్యంలో చుట్టుపక్కల ఉన్న రైతులతో ఆప్యాయంగా మాట్లాడి భూగర్భ జలాల నీటి ఎద్దడి, పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫామ్‌హౌస్‌కు విచ్చేసిన కార్యకర్తలతో, నాయకులతో ప్రేమగా మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అధికారంలో లేమని అధైర్యపడొద్దని నాయ కులకు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో హుజూరాబాద్ ఎంఎల్‌ఎ కౌశిక్‌రెడ్డి, ఆర్మూర్ మాజీ ఎంఎల్‌ఎ జీవన్‌రెడ్డి, బట్టు అంజిరెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జహంగీర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

మరోవైపు ఓమ్నీ వ్యాన్ స్టీరింగ్‌ను తన చేతుల్లోకి తీసుకుని కెసిఆర్ డ్రైవింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.అయితే, ’సారు మళ్లీ కారు నడుపుతున్నారు’ అంటూ బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమా నులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, గతేడాది డిసెంబర్ 8న అర్ధరాత్రి తన నివాసంలో కెసిఆర్ కాలు జారిపడ్డారు. ప్రమాదానికి గురైన తర్వా త కెసిఆర్‌కు వైద్యులు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. అనంతరం వైద్యులు కెసిఆర్‌ను వాకర్ సాయంతో నడిపించారు. డిశ్చార్జి తర్వాత కూడా ఆయన వైద్యుల సూచన మేరకు చాలా రోజులు ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసు కున్నారు. అనంతరం కొద్ది రోజులకు చేతి కర్ర సాయం తో నడిచారు. ఆ తర్వాత ఎన్నికల నేపథ్యంలో బిఆర్‌ఎస్ తరఫున చేతి కర్ర సాయంతోనే పలు సభలు, సమావేశాల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు పూర్తి గా కోలుకుని.. వైద్యుల సూచన మేరకు ఓమ్నీ వాహనం నడిపారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News