Monday, December 23, 2024

రెచ్చగొట్టొద్దు..కాల్పులు జరుపుతాం: డిఎంకె సర్కార్‌కు మాజీ సైనికుడి హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేస్తూ ఒక బిజెపికి చెఒందిన సభ్యుడు, మాజీ సైనికుడు మంగళవారం జరిగిన ఒక నిరసన ప్రదర్శనలో చేసిన ప్రసంగంపై చెన్నై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నోమోదు చేశారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ప్రభు అనే సైనిక జవాన్ హత్యకు గురయ్యాడు. వేలంపట్టి గ్రామంలో చిన్నస్వామి అనే డిఎంకె కార్యకర్త జరిపిన దాడిలో గాయాలపాలైన ప్రభు ఆసుపత్రిలో మరణించారు. ఈ సంఘటనను ఖండించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై మంగళవారం చెన్నైలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు బిజెపి మాజీ సైనికోద్యోగుల విభాగం సభ్యుడైన కల్నల్ బిబి పాండ్యన్(రిటైర్డ్) రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సైనిక సిబ్బందిని ఇబ్బంది పెట్టవద్దని, బాంబులు వేయడం, తుపాకులు కాల్చడం తమకు తెలుసునని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలో అత్యంత క్రమశిక్షణగల అగ్రశ్రేణి సైన్యంలో భారత్ రెండవ స్థానంలో ఉందని, తమను రెచ్చగొట్టవద్దని, బాంబులు అమర్చడంలో, కాల్పులు జరపడంలో, యుద్ధం చేయడంలో తాము సుశిక్షితులమని పాండ్యన్ అన్నారు. సైనికులకు హాని తలపెడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండవని, అది ప్రభుత్వానికి కాని, రాష్ట్ర ప్రజలకు కాని మంచిది కాదని ఆయన హెచ్చరించారు.

అనంతరం..విలేకరులతో మాట్లాడిన పాండ్యన్ తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకున్నారు. తన ప్రసంగానికి కట్టుబడి ఉంటానని, తాను తప్పేమీ మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఇది తమిళనాడు ప్రభుత్వానికి హెచ్చరికని, ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే రాష్ట్రంలో చట్టవ్యతిరేక పరిస్థితిని సృష్టిస్తామని పాండ్యన్ మరోసారి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News