Monday, December 23, 2024

అరుణాచల్‌లో మాజీ ఎమ్మెల్యే హత్య

- Advertisement -
- Advertisement -

గువహతి : అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే యమ్సెన్ మటేను దుంగులు కాల్పులు జరిపి , చంపివేశారు. తిరాప్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మయన్మార్ సరిహద్దులలో ఓ సామాజిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఈ స్థానిక ప్రముఖ నేతపై రాహో గ్రామంలో కాల్పులు జరిగాయి. ముందుగా ఆయనను దుండగులు సమీప అడవులలోకి తీసుకువెళ్లారు. వెంట ఆయన ముగ్గురు అనుచరులను కూడా పట్టుకువెళ్లారు. అక్కడ మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తరువాత సరిహద్దులు దాటి , సమీపంలోని మయన్మార్‌లోకి దుండగులు జారుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News