మన తెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్ర తినిధి: జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీ వద్ద గల టిబిజికెఎస్ ఆఫీసు ఎదురు గ ల్లీలో 15వ వార్డు మాజీ కౌన్సిలర్ సర ళ భర్త నాగవెల్లి రాజలింగమూర్తి (40) దారుణ హత్యకు గురయ్యాడు. బుధవా రం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వె ళ్తుండగా గుర్తుతెలియని దుండగులు క త్తులతో దాడి చేసి అతి కిరాతకంగా హ తమార్చారు. చికిత్స నిమిత్తం అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడు. జిల్లా పోలీసు ఉన్నతాధికారు లు ఆసుపత్రిలో రాజలింగమూర్తి మృతదేహాన్ని పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని దుండగులు రాజలింగమూర్తిని హత్య చేశారని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిఐ నరేశ్ తెలిపారు. మృతునికి భార్య సరళ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. రాజలింగమూర్తి హత్య ఘటన భూపాలపల్లిలో సంచలనంగా మారింది. మృతుడు సామాజిక కార్యకర్తగా పనిచేసేవాడు. పలుచోట్ల సమాచార హక్కు చట్టం కింద సమాచారం సేకరించేవాడు.ఇదిలావుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై మాజీ సిఎం కెసిఆర్, పలువురు మాజీ మంత్రులతో పాటు సదరు గుత్తేదారు కంపెనీలపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి హత్య పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై రాజలింగమూర్తి వేసిన నేపథ్యంలో మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు హరీశఃరావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టి సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ కుంగుబాటుకు కెసిఆర్ సహా పైన పేర్కొన్న వారే కారణమని పేర్కొంటూ నాగవెల్లి రాజలింగమూర్తి గత ఏడాది సెప్టెంబర్ 5న భూపాలపల్లి మొదట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశాడు. ఇదే సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో కొట్టేయాలని గత ఏడాది డిసెంబర్ 23న క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అది తమ పరిధి లేదని పేర్కొంటూ భూపాలపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది.