- Advertisement -
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ స్టార్ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌పై రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను ప్రసాద్ తప్పుపట్టాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టిన ఆటగాడిని తక్కువ చేసి మాట్లాడడం తగదన్నాడు. రాహుల్‌తో పోల్చితే ఇషాన్ దూకుడైన బ్యాటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. అతన్ని తొలి మ్యాచ్‌కు దూరంగా ఉంచడం తనను ఎంతో బాధించిందన్నాడు.
- Advertisement -