Thursday, January 23, 2025

గెలవాలనే కసి కనిపించడం లేదు.. యువ క్రికెటర్లపై విమర్శలు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: వెస్టిండీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా కూడా జట్టు ఆటతీరుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఆటగాళ్లలో గెలవాలనే కసి ఏమాత్రం కనిపించడం లేదన్నాడు. ఇది ఎంతో ఆందోళన కలిగించే పరిణామమన్నాడు.

టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు బిసిసిఐ ఎన్నో అవకాశాలు కల్పిస్తుందన్నాడు. అయితే అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీరు విఫలం కావడం బాధించే అంశమన్నాడు. విండీస్ సిరీస్‌లో ఆటగాళ్లు పూర్తిగా డీలా పడిపోయారని, గెలవాలనే కసి వారిలో కనిపించడం లేదని వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News