Saturday, November 16, 2024

స్మృతి మంధానపై ప్రశంసల వర్షం..

- Advertisement -
- Advertisement -

క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో చారిత్రక శతకంతో అలరించిన భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధానపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెటర్లే కాకుండా పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్లు సయితం ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మ్యాచ్‌లో మంధాన బ్యాటింగ్‌ను ఎంత పొగిడినా తక్కువేనని క్రికెట్ దిగ్గజాలు సునిల్ గవాస్కర్, కపిల్‌దేవ్, పీటర్సన్, స్టీవ్‌వా, వసీం అక్రమ్, రమీజ్ రాజా తదితరులు కొనియాడారు. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై మంధాన ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం తమను ఎంతో ఆనందానికి గురి చేసిందన్నారు. ఇక భారత మాజీ క్రికెటర్లు వసీం జాఫర్, ఆర్పీ సింగ్, మంజ్రేకర్, ఆకాశ్ చోప్రా తదితరులు కూడా మంధాన బ్యాటింగ్‌ను ప్రశంసించారు. మహిళల క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది ఒకటిగా నిలిచి పోవడం ఖాయమని వారు పేర్కొన్నారు.

కెరీర్‌లోనే అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ను ఆడిన మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 187 పరుగుల రికార్డు స్కోరును సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో శతకం సాధించి తొలి భారత మహిళా క్రికెటర్‌గా మంధాన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక మహిళల డేనైట్ టెస్టుల్లో కూడా భారత్‌కు ఇదే మొదటి శతకం కావడం విశేషం. కాగా, ఈ చారిత్రక మ్యాచ్‌కు వర్షం విలన్‌గా మారాడు. వరుసగా రెండో రోజు కూడా భారీ వర్షంతో పూర్తి ఆట సాధ్యం కాలేదు. భారత్ స్కోరు 276/5 పరుగులుగా ఉన్నప్పుడు వర్షం ఆరంభమైంది. ఆ తర్వాత ఆట ముందుకు సాగలేదు. ఆట నిలిపి వేసే సమయానికి దీప్తి శర్మ(12), తానియా భాటియా(0) క్రీజులో ఉన్నారు.

Ex Cricketers praise on Smriti Mandhana’s Century

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News