ముంబై:ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో జట్టు ఎంపికపై విమర్శలు వెల్లువెత్తాయి. వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా పుజారా, రహానె, జడేజాలను తుది జట్టులో కొనసాగించడంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక నాలుగో టెస్టులో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కన బెట్టడాన్ని వారు తప్పుపడుతున్నారు. వరుసగా విఫలమవుతున్న జడేజాను మరో అవకాశం ఇవ్వడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జడేజాతో పోల్చితే అశ్విన్ ఎంతో మెరుగైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని మంజ్రేకర్, సునిల్ గవాస్కర్, గంభీర్, జహీర్, ఆకాశ్ చోప్రా తదితరులు అభిప్రాయపడ్డారు.
జడేజా బదులు అశ్విన్‌ను తుది జట్టులో తీసుకొని ఉంటే జట్టుకు ప్రయోజనంగా ఉండేదని వారు పేర్కొంటున్నారు. అంతేగాక వరుసగా విఫలమవుతున్నా పుజారా, రహానెలకు మరో అవకాశం ఇవ్వడాన్ని కూడా వారు తప్పుపట్టారు. ఇక జట్టు ఎంపికలో కెప్టెన్ వ్యవహరిస్తున్న తీరును పలువురు మాజీ క్రికెటర్లు ఎండగట్టారు. కోహ్లి తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియాకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
Ex Cricketers slams Virat Kohli over Ashwin