Tuesday, September 17, 2024

సోమేశ్ కుమార్‌కు సిఐడి నోటీసులు

- Advertisement -
- Advertisement -

సిఐడి అధికారులు దూకుడు పెంచారు. జిఎస్‌టి కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకునే అవ కాశం కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సిఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు సిద్ధమవు తున్నారు. కొద్ది రోజుల్లోనే వీరికి నోటీసులు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. మొదట ఈ కేసు దర్యాప్తును హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు చేపట్టారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సిఐడికి అప్పగించింది. సిసిఎస్ నుంచి ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సిఐడి అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా సిఐడి అధికారులకు కీలక సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకే మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్ టాక్స్ అదనపు కమిషనర్ ఎస్‌వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఫ్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

స్పెషల్ ఇనిషియేటివ్స్ వాట్సాప్ గ్రూపు ద్వారా సోమేశ్ కుమార్ సర్వీస్ టాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్, శోభన్ బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు సిఐడి అధికారులు ఆధారాలను సేకరించినట్లు చెబుతున్నారు. కమర్షియల్ టాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తును సిఐడి అధికారులు చేపట్టారు. ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్లు ఆధారాలను సేకరించారు. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానాకు సుమారు 1000 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు సిఐడి అధికారులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సిఐడి దర్యాప్తు ముమ్మరం అయితే కీలక అంశాలు వెలు గులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ కేసును సిఐడి అధికారులు ప్రత్యేకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ ప్రభు త్వం కూడా ఈ కేసుపై సీరియస్ గానే దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పెద్దలు ఈ కేసు విషయంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసు కుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లేలా చేశారని ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే దీనిపై విచారణ చేపట్టింది. వీలైనంత వేగంగా విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సిఐడి అధికారు లు దూకుడు పెంచారు. కొద్దిరోజుల్లోనే నోటీసులు అందించి వారిని విచారించేందుకు సిఐడి అధికారులు సిద్ధమవుతున్నారు. సదరు అధికారుల ను విచారించిన తర్వాత కీలక అంశాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News