- Advertisement -
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ డీఎస్పీ నళిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పోలీసు ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో తెలంగాణ సాధన కోసం జరిగిన ఉద్యమంలో పదవిని త్యాగం చేసిన నళినిని.. వీలైతే తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే. ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని సీఎం ప్రశ్నించారు.
తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సీఎం చెప్పారు. ఈ విషయంపై అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం డా బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో రేవంత్ రెడ్డిని ఆమె కలిశారు.
- Advertisement -