Thursday, January 23, 2025

కర్నాటకలో రిటైర్డ్ డిఎస్పీ కుమారుడి అరెస్టు

- Advertisement -
- Advertisement -

బాగల్‌కోట్(కర్నాటక)/న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసులో ఢిల్లీ పోలీసులు కర్నాటకకు చెందిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి. ఒక రిటైర్డ్ డిఎస్‌పి కుమారుడైన సాయికృష్ణ జగలి అనే టెకీని బాధవారం రాత్రి బాగల్‌కోట్ జిల్లా ప్రధానకార్యాలయంలోని విద్యాగిరిలోని అతని ఇంట్లో పోలీసులు అరెస్టు చేసినట్లు వారు చెప్పారు. బెంగళూరులో ఒక బహుళజాతి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న సాయికృష్ణ గత వారం లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించి అక్కడ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకిన ఇద్దరు నిందితులలో ఒకరైన మైసూరువాసి మనోరంజన్ డికి సాయికృష్ణ మిత్రుడని వర్గాలు తెలిపాయి. కళాశాల రోజుల్లో వారిద్దరూ రూమ్‌మేట్స్ అని వర్గాలు చెప్పాయి.

ఢిల్లీ పోలీసు బృందం వచ్చి తన సోదరుడిని తీసుకెళ్లిందని సాయికృష్ణ సోదరి స్పంద తెలిపారు. ఢిల్లీ పోలీసు తమ ఇంటికి వచ్చిన మాట వాస్తవమేనని, తన సోదరుడిని ప్రశ్నించారని ఆమె చెప్పారు. దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరించామని ఆమె తెలిపారు. తన సోదరుడు ఎటువంటి తప్పు చేయలేదని స్పంద తెలిపారు. తన సోదరుడు, మనోరంజన్ ఇద్దరూ రూమ్‌మేట్స్ అని, ప్రస్తుతం తన సోదరుడు ఇంట్లో నుంచి పనిచేస్తున్నాడని ఆమె వివరించారు. ఇలా ఉండగా పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం కేసులో మరో ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించినట్లు వర్గాలు తెలిపాయి. వీరిలో ఒకరు కర్నాటకకు చెందిన నిందితుడు మనోరంజన్ స్నేహితుడని, మరో వ్యక్తి ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పోలీసులకు చెందిన స్పెషల్ టీమ్ వారిద్దరినీ బుధవారం ప్రశ్నించిందని వారు తెలిపారు. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం ఘటనజరగడానికి ముందు క్రియేట్ చేసిన భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ అనే ఫేస్‌బుక్ పేజీలో వీరిద్దరూ భాగస్వాములని, ఆ పేజీని నిందితులు డెలిట్ చేశారని వర్గాలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News