Monday, December 23, 2024

సాప్ట్‌వేర్ కంపెనీకి మాజీ ఉద్యోగి బాంబు బెదిరింపు కాల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ సాప్ట్ వేర్ కంపెనీకి గురువారం బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. టిసిఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు దుండగులు ఫోన్ చేసినట్లు సమాచారం. దీంతో తక్షణమే అప్రమత్తమైన టిసిఎస్ కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీలో తనిఖీలు చేశారు. బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని టిసిఎస్ కంపెనీ మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News