- Advertisement -
హైదరాబాద్: కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశించింది. పరిహారంపై మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రానికి తెలిపింది. ఆరు వారాల్లో పరిహారంపై విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వలేమని కేంద్రం గతంలో సుప్రీం కోర్టుకు తెలిపింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు విపత్తు సహాయం కింద పరిహారం ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంలో విచారణ జరిగింది. ఎక్స్ గ్రేషియా ఎంత ఇవ్వాలన్న నిర్ణయం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటి కమిటీకి సూచించాలని పేర్కొంది. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ మృతుల మరణ ధృవీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం సూచించింది.
- Advertisement -