Wednesday, November 13, 2024

ఆసుపత్రిలో చేరిన జార్ఖండ్ మాజీ సిఎం చంపై సొరేన్

- Advertisement -
- Advertisement -

రాంచీ: రక్తంలో చక్కెర సంబంధిత సమస్యలతో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సొరేన్(67) ఆసుపత్రిలో చేరారు. టాటా మెయిన్ హాస్పిటల్ లో ఆయన శనివారం రాత్రి 9 గంటలకు చేరారు. ఆయన రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో తలతిరిగినట్లయింది. దాంతో ఆయన సన్నిహితుడు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చంపై సొరేన్ పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ సుధీర్ రాయ్ తెలిపారు. చంపై సొరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా(జెఎంఎం) లో అగౌరవానికి, చులకనకు గురికావడంతో గత ఆగస్టులో బిజెపిలో చేరారు. హేమంత్ సొరేన్ జులై 3న బెయిల్ పై విడుదలయ్యాక చంపై సొరేన్ ముఖ్యమంత్రి పదవిని వదిలేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News