Monday, December 23, 2024

అపస్మారక స్థితిలో మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషి

- Advertisement -
- Advertisement -

ముంబై : మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ లోక్‌సభ స్పీకర్ మనోహర్ జోషీ (85) బ్రెయిన్ హెమరేజితో ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేష్ జోషి బుధవారం వెల్లడించారు. శివసేన సీనియర్ నేత అయిన జోషి పిడి హిందూజా ఆస్పత్రిలో సోమవారం చేరారు. బ్రెయిన్ ట్యూమర్‌తో అనేక చిక్కులను జోషి ఎదుర్కొంటున్నారని, ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స అందుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఆయన భార్య రష్మీ థాకరే మంగళవారం ఆస్పత్రికి వెళ్లి జోషి ఆరోగ్యంపై విచారించారు. మహారాష్ట్రలో 1966లో శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జోషి శివసేన మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై మేయర్‌గా, అసెంబ్లీలో విపక్ష నేతగా, వాజ్‌పాయ్ ప్రభుత్వంలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిగా జోషి పనిచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News