- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైలులో ఎంఐఎం మాజీ నేత ఫారూఖ్ అహ్మద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో మెరుగైన వైద్య కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. కాల్పుల కేసులో డిసెంబర్ 18 నుంచి ఫారూఖ్ అహ్మద్ రిమాండ్‌లో ఉన్నారు. ఫారూఖ్ తన తలను గోడకు బాదుకున్నాడని జైలు సిబ్బంది చెబుతున్నారు. ఫారూఖ్‌ను జైలు సిబ్బంది టార్చర్ చేస్తున్నారని కుటుంబసభ్యుల ఆరోపిస్తున్నారు. హైదరాబాద్‌కు తరలిస్తుండగా పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై రాజకీయ కక్ష పెంచుకున్న కొందరు తమను వేధిస్తున్నారని, ఈక్రమంలో జిల్లా ఎస్పీ వారియర్ కూడా వేధింపులకు పాల్పడుతున్నాడని ఫారూఖ్ తమ్ముడు బేగ్ ఆరోపించారు.
Ex MIM Leader Attempt Suicide in Adilabad Jail
- Advertisement -