Wednesday, January 22, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీ భవన్ లో పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బుధవారం ఎ చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరారు. ఆయనకు ఠాక్రే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఇటీవల చంద్రశేఖర్ బిజెపి పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని విమర్శిస్తున్న బిఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. కృష్ణ, గోదావరి జలాలను హైదరాబాద్ కు కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిందని, హైటెక్ సిటీని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ దేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బిఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News