Monday, December 23, 2024

బిజెపికి రాజీనామా చేసిన మాజీ మంత్రి చంద్రశేఖర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బిజెపి)కి మాజీ మంత్రి డాక్టర్ ఎ చంద్రశేఖర్ రాజీనామా చేశారు. గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి చంద్రశేఖర్ బిజెపికి ఆదివారం రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు.

1985 నుండి వికారాబాద్ లో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ చంద్ర శేఖర్ కొంతకాలంగా బిజెపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. బిజెపి వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్న చంద్రశేఖర్ పార్టీని వీడారు. కాగా, ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News