Monday, January 20, 2025

బిజెపిలో చేరిన మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి పనిచేసిన మాజీ మంత్రి జె. చిత్తరంజన్ దాస్ హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో శనివారం కమలం తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ వెళ్తూ మైసిగండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్థానిక దేవాలయంలో అమ్మవారి ఆశీస్సులు, పూజారుల ఆశీర్వాదం పొంది బయల్దేరినట్లు తెలిపారు. ఈటల రాజేందర్, డికె అరుణ, నాగర్‌కర్నూల్ జిల్లా నాయకుల సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాజీ మంత్రికి బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అదే విధంగా ఆయన వెంట సీనియర్ నాయకులు బండెల రామచంద్ర రెడ్డి, కానుగుల శేఖర్‌తో పాటు పలువురు నాయకలు, యువకులు కూడా బిజెపి పార్టీలో చేరారని బిసి కమిషన్ మాజీ సభ్యులు ఆచారి తెలిపారు. మాజీ మంత్రి జె చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, పార్టీ అధిష్ఠానం తనకు ఎక్కడ అవకాశం ఇచ్చినా బరిలో ఉంటానని, కల్వకుర్తి అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బిజెపి నాయకులు దుర్గా ప్రసాద్, రాఘవేందర్, శేఖర్‌రెడ్డి, నరసింహ, నర్సిరెడ్డి, రవి గౌడ్, సురేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News