Sunday, December 22, 2024

డికె అరుణ కుమార్తె క్రెడిట్ కార్డ్ చోరీ

- Advertisement -
- Advertisement -
రూ.11 లక్షలు హాంఫట్!

హైదరాబాద్ : రాష్ట్ర బిజెపి నేత, మాజీ మంత్రి డికె అరుణ కూతురు డీకే శృతిరెడ్డిని ఓ వ్యక్తి లక్షల్లో మోసం చేశాడు. ఆమె వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి క్రెడిట్ కార్డును దొంగిలించి లక్షల రూపాయలు కొట్టేశాడు. శృతిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెం 14లో వున్న ప్రేమ్ పర్వత్ విల్లాస్‌లో వుంటున్నారు. ఆమె వద్ద బీసన్న అనే వ్యక్తి గత డిసెంబర్ నుంచి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శృతిరెడ్డికి చెందిన క్రెడిట్ కార్డును దొంగిలించిన బీసన్న శ్రీమహావీర్ జెమ్స్ అండ్ పెరల్స్‌లో రూ.11 లక్షలు వాడుకున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించిన శృతిరెడ్డి బీసన్నపై అనుమానం వచ్చి అతనిని నిలదీశారు. అయితే ఆయన మాత్రం తనకు ఏ సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని స్వీకరించిన పోలీసులు బీసన్నపై ఐపిసి 420, 408 సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News