బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఈ పేరు ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. నిరుద్యోగి అయిన శిరీష.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడమే దీనికి కారణం. బర్రెలక్కగా నామినేషన్ వేసినప్పటి నుంచి శిరీష పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది. ఈ క్రమంలో అమెకు అండగా నిలబడేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మరీ సపోర్ట్ చేస్తున్నారు. ఆమె తరపున ఎన్నికల ప్రచారాల్లోనూ పాల్గొంటూ బర్కెలక్కకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. మరికొంతమంది ప్రచారానికి అవసరమైన డబ్బులు కూడా ఇస్తున్నారు.
తాజాగా పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు రూ.5.10 లక్షల చెక్కును ఆమెకు అందించారు. పుదుచ్చేరి ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మల్లాడి కృష్ణారావు సోమవారం శిరీషకు రూ.5.10 లక్షల చెక్కులను అందజేశారు. బర్రెలక్క నిజాయతీ, ధైర్యం నచ్చి.. పలువురు దాతలు, తన స్నేహితుల నుంచీ ఈ డబ్బు సేకరించి ఇచ్చానని మల్లాడి తెలిపారు. బరెలక్కకు ఒక్క అవకాశం ఇచ్చి కొల్లాపూర్ ప్రజలు గెలిపించాలని, పోలింగ్ కేంద్రాలలో ఆమె తరఫున ఏజెంట్లుగా ఉండేందుకు యువత ముందుకు రావాలని ఆయన కోరారు.