Tuesday, January 28, 2025

ఆ అక్రమాలపై విచారణ జరుగుతోంది: లోకేష్

- Advertisement -
- Advertisement -

అమరావతి: గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోందని మంత్రి లోకేష్ తెలిపారు. 7 నెలల్లో రూ. 6 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలియజేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లోనూ ఎన్డిఎ కూటమి గెలవాల్సి ఉందని జోస్యం చెప్పారు. దావోస్ కు జ్యూరిచ్ కు మధ్య తేడా రోజాకు తెలియదని ఎద్దేవా చేశారు. రెడ్ బుక్ అంటే చాలు వైసిపి నాయకులు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. విశాఖలో 90 రోజుల్లో టిసిఎస్ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం సాక్షి పరువు నష్టం కేసు విచారణకు విశాఖ పట్నానికి లోకేష్ రానున్నారు. అసత్య ప్రచారం చేసిందంటూ సాక్షి పత్రికపై లోకేష్ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. కోర్టులో కేసుకు సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ కు లోకేష్ హాజరు కానున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News