మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: బిజె పికి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు ఇను గాల పెద్దిరెడ్డి బిజెపికి సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ రాష్ట్ర అ ధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌కు పంపించారు. ఈటల రాజేందర్ బిజె పిలో చేరడాన్ని ఆయన తీవ్రంగా వ్య తిరేకించారు. కనీసం తనతో చర్చించకుండానే ఈటలను పార్టీలో చేర్చుకున్నార ని పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు టిడిపిలో ఉన్న పెద్దిరెడ్డి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు.
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి ఆయన గతంలో ప్రాతినిథ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి టిడిపిని వీడి బిజెపిలో చేరారు. హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. అయితే అనూహ్యంగా చో టు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పెద్దిరెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం కొంతకాలంగా సాగు తోంది. పెద్దిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Ex Minister Peddireddy Resigns to BJP Party