- Advertisement -
ఎపిలో అధికార పార్టీ వైసిపికి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి మరో నేత బయటకొచ్చారు. మాజీ మంత్రి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మంగళవారం వైసిపికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్లు రాజీనామా లేఖలో ఆయన చెప్పారు. రాజీనామా కాపీని సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయిరెడ్డిలకు పంపించారు.
వైసిపిలో తనకు సముచిత ప్రాదాన్యం ఇవ్వడం లేదని వీరభద్రరావు అవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని తెలిపారు. ఇటీవల వైసిపి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -