Monday, December 23, 2024

మాజీ సిఎం కెసిఆర్‌ను కలిసిన ఆరూరి రమేశ్

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిశార్చ్ అయిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను శుక్రవారం బీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ కలిశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు.

ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌస్‌లో పడిపోవడంతో కేసీఆర్‌కు ఫ్రాక్చర్ కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనను పరామర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ విభాగం కార్యదర్శి కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News