Sunday, December 22, 2024

ఫోన్ ట్యాపింగి కేసు.. విచారణకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి హాజరు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న రాజకీయ నేతలకు పోలీసుల నోటీసులు పంపారు.

రెండు రోజుల క్రితి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో గురువారం ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కీలక అంశాలపై పోలీసులు విచారించనున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో నలుగురు బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు ఇచ్చిన పోలీసులు.. చిరుమర్తి లింగయ్య విచారణ అనంతరం మరికొంత మందికి నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News